పురుషుల హాకీ వరల్డ్ కప్-2023లో ఇండియా బోణీ కొట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ పై 2-0తేడాతో విజయం సాధించింది.
రూర్కెలా లోని బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా రోహిదాస్ అమిత్ తొలి గోల్ అందించాడు. 27వ నిమిషంలో హార్దిక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరును 2-0 ఆధిక్యానికి తీసుకెళ్ళాడు. తర్వాతి అర్ధ భాగంలో రెండు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి.
ఇండియాకు ఆరు సార్లు పెనాల్టీ కార్నర్ అవకాశాలు కాగా ఒకదానిలో విజయం సాధించగా, స్పెయిన్ కు మూడు అవకాశాలు రాగా గోల్స్ చేయలేకపోయింది.
రోహిదాస్ అమిత్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సిఎం ముఖ్యమంత్రి ప్రేమ సింగ్ తమంగ్ లు ఈ మ్యాచ్ ను వీక్షించడానికి హాజరయ్యారు.