Sunday, November 24, 2024
HomeTrending Newsముకర్రమ్ రుూ అంత్యక్రియలపై వి.హెచ్.పి ఆగ్రహం

ముకర్రమ్ రుూ అంత్యక్రియలపై వి.హెచ్.పి ఆగ్రహం

ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదు. అలా చేస్తే తెలంగాణా పోరాటాల చరిత్రను,నిజాం వ్యతిరేఖ పోరాటంలో నాటి ప్రజలు చేసిన త్యాగాలను అవమానించడమేనని విశ్వహిందూ పరిషత్ (VHP)ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిజాం వారసత్వాన్ని అధికారికంగా గుర్తించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మండిపడుతోంది. ఈ మేరకు సోమవారం రాత్రి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ ప్రకటన విడుదల చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలోని హిందువుల మాన ప్రాణాలపై నిజాం రజాకార్లు సాగించిన మారణహోమాన్ని ఎన్ని తరాలు మారినా ఇక్కడి ప్రజలు మర్చిపోరని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మహిళలను బట్టలు విప్పి బతుకమ్మ ఆడించిన చరిత్ర నిజాం రాజుది అని విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి KCR గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ లిబరేషన్ డే పేరుతో కార్యక్రమం కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి స్వయంగా దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిజాం వ్యతిరేఖ పోరాటంలో త్యాగాలు చేసిన వారి సేవలు స్మరించుకున్నారని చెప్పారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాం వారసుడికి అధికారిక అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కెసిఆర్ చర్య ఈ ప్రాంత ప్రజలు సాగించిన స్వాతంత్ర్య పోరాటాన్ని అగౌరవ పరిచేలా ఉందన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్య వల్ల తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని.. లేదంటే మధ్య పాకిస్తాన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో విలీనం చేసేందుకు నిజాం కుట్రలు
పన్నిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, MIM ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ ప్రజల త్యాగాలను కించపరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరించారు. ముకర్రమ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్