Sunday, November 24, 2024
HomeTrending Newsఅందుకే క్రాప్ హాలిడే: నిమ్మల ఆరోపణ

అందుకే క్రాప్ హాలిడే: నిమ్మల ఆరోపణ

రాష్ట్ర ప్రభుత్వానికి కోడిపందేలు, పేకాటపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతులు కనీసం సంక్రాంతి జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నరని అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి లాగా ఉందన్నారు. 2020-21లో 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కానీ ఈ ఏడాది 37 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారని వెల్లడించారు.  లక్ష్యం పూర్తయ్యిందని చెప్పి ధాన్యం సేకరణ నిలివిపేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోటి మెట్రిక్ టన్నులు సేకరిస్తుంటే ఇక్కడ దానిలో సగం కూడా చేయకపోవడం సరికాదన్నారు. సిఎం జగన్ విధానాల వల్ల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోతుందన్నారు.  పంట పండించడం కంటే విరామం ఇవ్వడమే మేలని రైతులు భావిస్తున్నారని చెప్పారు.

ధాన్యం మొత్తాన్ని ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకొని రైహ్టు భరోసా కేంద్రాలకే అమ్మాలనే నిబంధన పెట్టారని, దీనివల్ల కౌలు రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని రామానాయుడు ఆవేదన వెలిబుచ్చారు. తేమ శాతం నిబంధన రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. అందుకే రైతులు వ్యవసాయం నుంచి బైటికి వచ్చి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని అన్నారు. తాజాగా గోతాలు అందుబాటులో లేని సమస్య తలెత్తిందన్నారు.  ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ఎందుకు తగ్గించారో చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సమస్యలపై సమీక్ష నిర్వహించి వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్