Thursday, April 17, 2025
HomeTrending Newsనిజం గెలవాలి: వైఎస్ అవినాష్ రెడ్డి

నిజం గెలవాలి: వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్  వివేకా హత్య కేసులో నిజం గెలవాలని, అసలు వాస్తవం ఏమిటో బైటకురావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఈ కేసు విషయంలో గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన సన్నిహిత కుటుంబ సభ్యులపై ఒక సెక్షన్ ఆఫ్  మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని, తన క్యారెక్టర్ ను చంపే ప్రయత్నం చేస్తూ  వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సిబిఐ ఇచ్చిన నోటీసులపై  అవినాష్ రెడ్డి స్పందించారు. నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ రావాలని కోరారని, కానీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో నాలుగైదు రోజుల తరువాత వారు ఎప్పుడు నోటీసులు ఇస్తే అప్పుడు వారి ముందు హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

తనపై ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించాలని,  కేసు విషయంలో ముందే ఓ నిర్ధారణకు, ముగింపుకు రావొద్దని కోరారు. మీపై ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో  ఒకసారి ఊహించుకోవాలని సూచించారు.  తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని, తానేమిటో… తన వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసని  అన్నారు. ఈ కేసులో అసలు నిజం బైటకు రావాలని తాను కూడా భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు చెప్పారు. సిబిఐ విచారణ మొదలు కాకముందే మీడియా విచారణ మొదలు పెట్టిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్