బాలకృష్ణ వీరమాస్ బ్లాక్ బస్టర్ అంటూ ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ ను సెలబ్రేట్ చేశారు. సంక్రాంతికి వచ్చిన చిత్రం మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది. ఆతర్వాత జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే… అంచనాలను మించిన సక్సెస్ సాధించింది.
ఇటీవల ఓవర్ సీస్ లో ఉన్న అభిమానులతో చిరంజీవి మాట్లాడడం జరిగింది. అంతే కాకుండా… ఈ మూవీ రేటింగ్స్ పై స్పందించడం కూడా జరిగింది. ఓవర్ సీస్ లో 2.5 మిలియన్స్ పైగా కలెక్ట్ చేసింది. ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత 2 మిలియన్ క్రాస్ చేసిన చిరంజీవి సినిమాగా నిలిచింది. అయితే… ఇంతటి విజయాన్ని సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని వాల్తేరు వీరయ్య విజయోత్సవం జరపడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీరయ్య విజయ విహారం పేరిట జనవరి 28 వ తేదీన వరంగల్ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండ లో నిర్వహించేందుకు సిద్దం అవుతోంది.
ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, జయ సింహ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ డిఎస్పీ అదిరిపోయే సంగీతం అందించారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించారు కానీ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ రాలేదు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో చిరంజీవితో పాటు ఆయన అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రెట్టించిన ఉత్సాహంతో చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లేదా దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.