Sunday, November 24, 2024
HomeTrending Newsహైదరాబాద్ లో జీ20 - స్టార్టప్ 20 సమావేశం

హైదరాబాద్ లో జీ20 – స్టార్టప్ 20 సమావేశం

ఉద్యోగాల కోసం వేచిచూడటం కంటే.. ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ రోజు జరిగిన జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ 85వేలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్‌లతో ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించిందన్నారు. ఈ స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి అని అందుకే ఈ వ్యవస్థను ప్రోత్సహించేలా పాలసీలు రూపొందించిందని వెల్లాడించారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని చెప్పారు. 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానాలు మెరుగుపడిందని, వచ్చే 25 ఏళ్ల అమృత కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని మరిన్ని కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకెళ్తోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్