న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20లో ఇండియా చెమటోడ్చి విజయం సాధించింది. ప్రత్యర్థిని 99 పరుగులకే కట్టడి చేసిన ఇండియా ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో చివరి ఓవర్ వరకూ పోరాడాల్సి వచ్చింది.
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా బౌలర్ల ధాటికి పరుగులు రాబట్టడంలో కివీస్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు.35 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. శాంట్నర్ ఒక్కడే 19 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.
అర్ష్ దీప్ సింగ్ రెండు; హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇండియా 17 పరుగులకు తొలి వికెట్ (గిల్-11) కోల్పోయింది. ఇషాన్ కిషన్ (19) 45వద్ద వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి-13; వాషింగ్టన్ సుందర్-10 రన్స్ చేసి ఔటయ్యారు. సూర్య కుమార్ యాదవ్ -26; కెప్టెన్ పాండ్యా -15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. చివరి ఓవర్లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి, ఐదో బంతిని ఫోర్ గా మలిచి విజయం అందించాడు సూర్య కుమార్ యాదవ్.
మూడు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయ్యింది. చివరి మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ లో జరగనుంది.
సూర్య కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది