Monday, January 20, 2025
HomeTrending News4 వేల ఆంధ్రా ఫిష్ హబ్ లు : మంత్రుల కమిటీ

4 వేల ఆంధ్రా ఫిష్ హబ్ లు : మంత్రుల కమిటీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో కనీసం 30 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆక్వా ఎంపవరింగ్ కమిటీలోని మంత్రులు అధికారులను ఆదేశించారు. దీనికి గాను ఫిష్ ఆంధ్రా హబ్ లను ఏర్పాటు చేయాలని సిఎం జగన్ ఇప్పటికే సూచించారని, వచ్చే మార్చి నెలాఖరు నాటికి మొత్తం 4వేల హబ్ లను  చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హబ్ లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై) కింద సబ్సిడీతో కూడిన రుణాలను కూడా అందించేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు.  సచివాలయంలో ఆక్వా ఎంపవరింగ్ కమిటీ సమావేశం జరిగింది.  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వి.రఘురాం తదితరులు పాల్గొన్నారు.

సాధికారిత కమిటీ ద్వారా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలపై కమిటీ సమీక్షించింది.

ఈ సమావేశంలో మంత్రులు వెల్లడించిన అభిప్రాయాలు, సూచనలు

  • రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల హెక్టార్ లలో ఆక్వా సాగు జరుగుతోంది
  • ఈ-ఫిష్ సర్వే ఆధారంగా ఈ రంగంపై మొత్తం 1.38 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 2.27 ఎంటిల ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసేందుకు 111 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి
  • ఇప్పటికే ఈక్విడార్, బ్రెజిల్ వంటి దేశాలతో పోటీ పడుతూ మనదేశం నుంచి ఎపి ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు
  • అన్ని ప్రముఖ నగరాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్
  • ఆక్వాసీడ్, ఫీడ్ రేట్లు పెరగకుండా ఎప్పటికప్పుడు ఫిషరీస్ అధికారులు సీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లతో జరుపుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయి

  • ఈ కమిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ రేట్లను నియంత్రణలోకి వచ్చాయి
  • ఆక్వా ఉత్పత్తుల ధరలు పతనం కాకుండా అడ్డుకట్ట వేయగలిగాం
  • ఆక్వా సమస్యలపై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్ గా పరిగణించాలి
  • ఆక్వా రైతులకు చేయూత అందించేందుకు ఆక్వాజోన్ పరిధిలో పది ఎకరాల విస్తీర్ణం లోపల సాగుచేసే వారికి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోండి
  • తాజాగా ఆక్వాజోన్ లోపల, వెలుపల సాగవుతున్న విస్తీర్ణంను గుర్తించేందుకు మత్స్యశాఖ నిర్వహిస్తున్న సర్వే వచ్చే నెలాఖరు నాటికి పూర్తవుతుంది
  • ఇప్పటికే 26వేల కనెక్షన్ లకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోంది
  • ఈ సర్వే ద్వారా ఆధార్ తో ఆక్వారైతుల వివరాలు అనుసంధానం అవుతాయి, ఖచ్చితంగా ఎంతమంది అర్హులైన రైతులు ఉన్నారో నిర్ధిష్టంగా తెలుస్తుంది
  • అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీని అందించాలని సిఎం జగన్ నిర్దేశించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్