Tuesday, February 25, 2025
Homeస్పోర్ట్స్Women’s T20 Tri Series: సౌతఫ్రికాదే విజయం

Women’s T20 Tri Series: సౌతఫ్రికాదే విజయం

ఇండియా-సౌతాఫ్రికా-వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన టి 20 ముక్కోణపు సిరీస్ ను ఆతిథ్య సౌతాఫ్రికా గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్ లో ఇండియా పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ తడబడింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని  సౌతాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఈస్ట్ లండన్ బఫెలో పార్క్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు ఒక్క పరుగు వద్ద స్మృతి మందానా డకౌట్ అయ్యింది. మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్యూస్ (11) కూడా 21 పరుగుల వద్ద  ఔటయ్యింది. హర్లీన్ డియోల్- 49; కెప్టెన్ హర్మన్ ప్రీత్-21;  దీప్తి శర్మ-16 పరుగులు చేశారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 21 పరుగులకే మూడు వికెట్లు (లారా వోల్వార్ద్ట్ –డకౌట్, టాజమిన్ బ్రిట్స్-8; లారా గూడాల్-7) కోల్పోయింది. చోల్ టైరన్ -57 పరుగులతో రాణించింది. స్నేహ్ రానా రెండు; దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక తలా ఒక వికెట్ పడగొట్టారు.

చోల్ టైరన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్….. ఇండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్