Saturday, November 23, 2024
HomeTrending Newsఈ ప్రభుత్వం మీతో ఉంది: సిఎం జగన్

ఈ ప్రభుత్వం మీతో ఉంది: సిఎం జగన్

పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు.  విద్యమీద పెట్టే ప్రతి పెట్టుబడి మానవనరులమీద పెట్టినట్టేనని, ఉన్నత విద్యతో  కుటుంబాల తలరాతలే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారతాయని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులమీద భారం పెట్టడం ఇష్టంలేక చాలా మంది నిరుపేద విద్యార్ధులు ఉన్నత విద్యకు వెళ్ళకుండా వెనకడుగు వేసే పరిస్థితులు ఉండేవని, కానీ ఈ ప్రభుత్వం మీతో ఉందని, మీకు మద్దతుగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.  బాగా చదువుకొని పైకి ఎదిగాక రాష్ట్ర ప్రతిష్టలను నిలబెట్టాలని విద్యార్ధుల నుద్దేశించి సిఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత సాయాన్ని నేడు అందించారు.  ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను నేడు క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సిఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  విదేశీ విద్యాదీవెన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యయంగా నిలిచిపోతుందని అభివర్ణించారు.

సిఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • విద్యార్ధులకు ఈ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోంది
  • కార్నిగీ మిలన్‌ యూనివర్శిటీ రూ. కోటి 16 లక్షల ఫీజు
  • సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్శిటీ కోటి రూపాయల ఫీజు
  • బోస్టన్‌ యూనివర్శిటీ రూ. 97 లక్షల ఫీజు
  • హార్వర్డ్‌ యూనివర్శిటీ సుమారు రూ. 88 లక్షల ఫీజు
  • ఇవి సామాన్యులు ఎవ్వరూ కూడా భరించే ఫీజులు కావు
  • ఇలాంటి చోట సీట్లు వచ్చినా కూడా ఈ డబ్బులు కట్టే పరిస్థితి లేదు
  • రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద పెట్టుబడి విద్యమీద పెడుతున్నాం
  • మహాత్మగాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ లాంటి వాళ్లు పెద్ద పెద్ద యూనివర్శిటీలనుంచి వచ్చినవారే
  • ఇవ్వాళ్టి పెద్ద పెద్ద కంపెనీల్లోని సీఈఓలు నుంచి మొదలుపోడితే.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌వరకూ కూడా పెద్ద పెద్ద యూనివర్శిటీలనుంచి వచ్చినవారే
  • ఆ స్థాయిలో కలలను మీరు నిజంచేయాలి
  • దేశం ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టనుకూడా పెంచాలి
  • మంచి యూనివర్శిటీలో సీటు వస్తే.. డబ్బులు కట్టలేక వెనకడుగు వేసే పరిస్థితి రాకూడదనే ఈ పథకం
  • బెస్ట్‌ యూనివర్శిటీలు, బెస్ట్‌ కాలేజీల్లో సీట్లు వచ్చినవారికి ప్రభుత్వం అండగా నిలిచింది
  • టాప్‌ 200 యూనివర్శిటీల్లో సీట్లు వస్తే.. పారదర్శకంగా ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుంది

  • గతంలో ఉన్న స్కీం ఎలా అమలు జరిగేదో చూశాం, అదొక వైట్‌ వాష్‌ కార్యక్రమం
  • కేవలం రూ.10-15 లక్షలకు పరిమితమైంది, దీనివల్ల ప్రయోజనం అరకొరగానే ఉండేది
  • గతంలో బకాయిలు కూడా చెల్లించకపోవడంతో పథకాన్ని మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి
  • పథకాన్ని అమలు చేయడంలో గతంలో చిత్తశుద్ధిలేదు
  • ఆ పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో దీన్ని ప్రారంభిస్తున్నాం
  • పెద్ద యూనివర్శిటీల్లో సీట్లు వస్తే.. వారికి తోడుగా నిలవాలన్న ఆలోచనలో నుంచి ఇది వచ్చింది
  • మన రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీల రూపురేఖలను మారుస్తున్నాం
  • పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నాం
  • ఈ ఏడాది 213 మంది పిల్లలు దరఖాస్తు చేసుకుని పారదర్శకంగా ఎంపికయ్యారు:
  • మీకు ఎలాంటి సమస్య ఉన్నా.. వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం
  • సీఎంఓలో ఒక అధికారి నంబర్‌ను మీకు ఇస్తాం. కాల్‌చేసి.. వెంటనే సహాయం తీసుకోవచ్చు
  • ప్రతి విషయంలోకూడా మీకు తోడుగా ఉంటాం అంటూ విద్యార్ధులతో జగన్ మాట్లాడారు.

Also Read : ఏపీలో వనరులు పుష్కలం : సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్