Sunday, November 24, 2024
Homeసినిమాసందీప్ కిషన్ యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తే బాగుండేదేమో!

సందీప్ కిషన్ యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తే బాగుండేదేమో!

Michael: ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలంతా యాక్షన్ హీరోగా .. మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అలాంటి పాత్రల కోసం చాలా రిస్క్ చేస్తున్నారు. అలాంటి హీరోల్లో ఒకరుగా సందీప్ కిషన్ కనిపిస్తునాడు. నిజానికి మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ హీరోగా ఎదగడం కోసం కసినీ .. కృషిని చూపిస్తూ వస్తున్నాడు. అలా ఆయన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమానే ‘మైఖేల్’. ఈ రోజునే ఈ సినిమా విడుదలైంది.

భరత్ చౌదరి నిర్మాణంలో .. రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ .. హీరో బాల్యం నుంచి మొదలవుతుంది. చిన్నతనంలోనే తన తండ్రి పట్ల గల ద్వేషంతో అతణ్ణి చంపడానికి హీరో ముంబాయి బయల్దేరి వెళతాడు. అక్కడ మాఫియా నాయకుడి ప్రాపకాన్ని సంపాదించుకుని, యువకుడిగా ఎదుగుతాడు. బాస్ అప్పగించిన బాధ్యత ప్రకారం హీరోయిన్ ను .. ఆమె తండ్రిని చంపడానికి ఢిల్లీ వెళతాడు. హీరోయిన్ ప్రేమలో పడిపోవడమే కాకుండా, మరో ఘనకార్యం కూడా చేసి బాస్ ఆగ్రహానికి గురవుతాడు. పర్యవసానంగా ఏం జరుగుతుందనేది కథ.

సందీప్ కిషన్ పాత్రపై .. ఆయన ట్రాక్ పై పెట్టిన శ్రద్ధ, మిగతా పాత్రలపై దర్శకుడు పెట్టలేదనిపిస్తుంది. అక్కడక్కడా ఎమోషన్ ను కనెక్ట్ చేస్తూ యాక్షన్ ను నడిపించుకుంటూ వెళితే .. హీరో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనే క్లారిటీ ఆడియన్స్ కి ఉండేది. అలా కాకుండా ప్రీ క్లైమాక్స్ వరకూ ఎమోషన్ ను దాచిపెట్టేసి .. యాక్షన్ చేయించడమే ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. ఇక విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రల విషయంలోను అదే పొరపాటు జరిగింది.

ఈ సినిమా ఇంకో అరగంటలో అయిపోతుందనగా ఈ ఇద్దరూ ఎంట్రీ ఇస్తారు. భార్యాభర్తలుగా వీరి పాత్రలను డిజైన్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరికాసేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ అంత సమయం అక్కడ లేదు. యాక్షన్ కి కారణమైన ఎమోషన్ లో బలం లేకపోవడం వలన .. హీరో హీరోయిన్స్ రొమాన్స్ కి మధ్య వారథిగా గా నిలిచే పసందైన పాటలు లేకపోవడం వలన ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్