Sunday, November 24, 2024
HomeTrending Newsసిఎంను కలుసుకున్న ఎస్ఎస్ఎస్ అవార్డు గ్రహీతలు

సిఎంను కలుసుకున్న ఎస్ఎస్ఎస్ అవార్డు గ్రహీతలు

నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌(ఎన్‌ఎస్‌ఎస్‌) జాతీయ అవార్డు గ్రహీతలు, న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్న ఏపీ విద్యార్ధులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్ధులను సిఎం ప్రత్యేకంగా అభినందించి రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.

ఏపీలో 36 యూనివర్శిటీలలో 2173 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లలో జరుగుతున్న కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీసర్ సిఎంకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్ధాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ కృషిచేస్తుందని చెప్పారు.

2019 – 20, 2020 – 21 సంవత్సరాలకు గాను ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు గ్రహీతలు డాక్టర్‌ పి.అశోక్‌ రెడ్డి, డాక్టర్‌ కే.జితేంద్ర గౌడ్, సీహెచ్‌.పార్ధసారధి, సిరి దేవనపల్లి, డి.సాయి లను….. రిపబ్లిక్‌ డే పెరెడ్‌లో పాల్గొన్న విద్యార్ధులు వందన, భువనేశ్వరి, పాలవలస రమ్య, శ్రీ మహాలక్ష్మి, దీదేప్య, వీఎస్‌ఎన్‌ లక్ష్మణ్, గౌతమ్‌ దీపక్‌ రెడ్డి, బి.గోపి, రెడ్డి జిష్ణు, జే.వాసు లను సిఎం అభినందించారు.  ఈ సందర్భంగా సీఎంని కలిసినవారిలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు, స్టేట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.అశోక్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఈటీఐ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.రామచంద్రరావులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్