Sunday, November 24, 2024
HomeTrending Newsఎన్టీఆర్ మృతిపై సిబిఐ విచారణ: నాని డిమాండ్

ఎన్టీఆర్ మృతిపై సిబిఐ విచారణ: నాని డిమాండ్

ఎన్టీఆర్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. అయన మరణించి 27 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అది మిస్టరీగానే ఉందని, అందుకే దానిపై విచారణ కోసం ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సిఎంలు కేసిఆర్, జగన్ లను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. సిఎం జగన్ పై లోకేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, యువ గళం పాదయాత్రకు సరైన స్పందన లేకపోవడంతో ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా గురించి మాట్లాడుతున్న లోకేష్ తన బాబాయి నారా రామూర్తి నాయుడిని మీడియా ముందుకు తీసుకు రావాలని సవాల్ చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు తిట్టిన తరువాత ఏమయ్యాడో తెలియడం లేదన్నారు. మొన్న సంక్రాంతికి నారావారి పల్లెకు అయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. లోకేష్ వలసల గురించి మాట్లాడుతున్నారని, అసలు నారావారి పల్లె నుంచి వలస పోయింది మీరు కాదా అని నిలదీశారు.

తాము భువనేశ్వరి గురించి  ఏదో మాట్లాడామని బాబు వెక్కి వెక్కి ఏడ్చారని, వారు మాత్రం వైఎస్ భారతమ్మ గురించి అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని నానిఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పుడైనా సిఎం జగన్ తో మాట్లాడాలంటే ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, కేఎన్నార్ , అనిల్ లలో ఎవరికో ఒకరికి  ఫోన్ చేసి మాట్లాడతామని… దాంట్లో తప్పుబట్టాల్సింది ఏముందని నిలదీశారు.   వివేకా హత్య జరిగిన రోజున నాటి సిఎం చంద్రబాబు, ఇంటలిజెన్స్ డిజి ఏబీ వెంకటేశ్వర రావు, కడప జిల్లా పార్టీ నేతలు కూడా ఫోన్ లో ఏమి మాట్లాడుకున్నారో సిబిఐ విచారణ జరిపించాలని కొడాలి డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ కు నిజమైన వారసుడిగా తారక రత్న కూడా లోకేష్ పాదయాత్ర లో కలిసి నడవాలనుకుంటే ఆయనకు గుండెపోటు వచ్చిందని, 400 మంది ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకున్న లోకేష్.. ఆ సమయంలో తారక రత్నకు ఎందుకు రక్షణ ఇవ్వలేకపోయరని… గతంలో ఎన్టీఆర్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని హరికృష్ణ నాడు డిమాండ్ చేస్తే ఎందుకు చేయించలేదని నాని సూటిగా ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్