Sunday, November 24, 2024
HomeTrending Newsసీఎం కేసీఆర్ నాందేడ్‌ పర్యటన హైలెట్స్

సీఎం కేసీఆర్ నాందేడ్‌ పర్యటన హైలెట్స్

తొలిసారిగా తెలంగాణ వెలుప‌ల జ‌రిగిన‌ బీఆర్ఎస్ స‌భ కోసం నాందేడ్ కు వ‌చ్చిన‌ బీఆర్ఎస్ అధినేత సీయం కేసీఆర్ ను చూడాలని ఎంతో మంది రైతులు, ప్రజలు తరలివచ్చారు. సీయం కేసీఆర్ ప‌ట్ల అభిమానాన్ని చాటిన‌ బీఆర్ఎస్ మ‌హారాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతులు, వృద్దులు, మ‌హిళ‌ల‌కు కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభ మంచి విజయం సాధించడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిం. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పంద‌న వచ్చింది.

మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటన కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం గం.1.15 కు బయలుదేరారు. బేగంపేటలోని విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో నాందేడ్ కు బయలుదేరారు. మధ్యాహ్నం రెండు గంటలకు నాందేడ్ లోని శ్రీ గురుగోబింద్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు విమానాశ్రయంలో బీఆర్ఎస్ నాందేడ్ మరియు తెలంగాణ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ నాందేడ్ చారిత్రక గురుద్వారాను చేరుకున్నారు. సిక్కు మత గురువులు సాంప్రదాయ పద్ధతిలో సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

• అనంతరం గురుద్వారా నుంచి బీఆర్ఎస్ చేరికల సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్‌ నేతల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాందేడ్‌ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

• గురు గోవింద్ సింగ్ మహాభినిష్క్రమణంతో నిర్మితమైన సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారాను సీఎం కేసీఆర్ సందర్శించారు.
• సభాస్థలికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌ స‌భా వేదికపై మరాఠా యోధులు చత్రపతి శివాజీ మహారాజ్, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతి బాఫూలే, మహాత్మా బసవేశ్వర్ మహారాజ్, అన్నభావ్ సాఠే, అహిల్యబాయి హోవల్కర్ విగ్ర‌హాల‌కు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
• బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు సీనియర్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సాహంతో తరలి వచ్చారు.
• ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సీఎం కేసీర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
• సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ చప్పట్లతో, నినాదాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
• తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తమకు కావాలనే ఆకాంక్ష వారి హర్షాతిరేకాల్లో వ్యక్తమైంది.
• దేశానికి నేతంటే కేసీఆర్ యేనని నినాదాలు మారుమోగాయి.

సమావేశం ముగిసిన తర్వాత స్థానిక సిటీ ప్రైడ్‌ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ భోజనానంతరం జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
• నేషనల్ మీడియా విస్తృతంగా కవరేజీ, లైవ్ లు అందించింది.
• ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్థానిక మీడియా, నేషనల్ మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సావధానంగా, లోతైన విశ్లేషణతో సమాధానమిచ్చారు.
• భారతదేశ పురోగతికి అవుటాఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచనలు చేయాలని చెప్తూ …… మీడియాకు రీ ఇన్వెంట్ – రీ ఓరియంట్ ఇండియా, వరల్డ్ బిగ్గెస్ట్ డామ్స్, కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్ స్టాల్డ్ కెపాసిటి తదితర డాక్యుమెంట్లను అందించారు.
•  అనంతరం నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, బిబి పాటిల్, ఎమ్మెల్సీ కవిత, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జోగు రామన్న, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, మైనంపల్లి హన్మంతరావు, విఠల్ రెడ్డి, కార్పోరేషన్ ఛైర్మన్లు రవీందర్ సింగ్, మారం గంగారెడ్డి, రాజీవ్ సాగర్, వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, ఎపి బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : గులాబీమ‌య‌మైన నాందేడ్…బీఆర్‌ఎస్ సభకు స‌ర్వం సిద్ధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్