ప్రజలను దోచుకోవడం కాదు – ప్రజలను కాచుకునే నాయకుడిగా.. గెలవాలని, నిలవాలని, మిగలాలనీ, తలచే, తపించే ఓ నిస్వార్ధ నాయకుడు కథాంశంతో రూపొందిన చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. రాజకీయ జీవన ప్రవాసంలోకి, ఓ రాజకీయ నాయకుడు కొడుకు రావడం.. ఆయన హృదయంలోకి అడుగిడిన ఓ అడవిమల్లి జీవితంలోకి మరొక దుష్ట రాజకీయ నాయకుడు రావడం.. ఆ చెరను చేదించుకొని ఆయన కబంధ హస్తాల నుంచి బయటపడి ఓ స్వచ్ఛమైన సిరిమల్లెలా ఎలా విరిసి వికసించిందనేదే ఈ చిత్ర కథ. గిరిజన నేపథ్యంలో సాగిన ఓ భిన్నమైన రాజకీయ ప్రేమ కథ చిత్రమిది.
షకీరా మూవీస్ పతాకం పై శ్రీకర్ కృష్ణ, శ్రావణి నిక్కీ, అజయ్ ఘోష్, జయ నాయుడు, అమ్మ రమేష్, షఫీ క్వాద్రి నటీ నటులుగా గౌతమ్ మైలవరం దర్శకత్వంలో కౌసర్ జహాన్ నిర్మించిన చిత్రం “సిరిమల్లె పువ్వా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ డైరెక్టర్ చంద్రమహేష్ , డైరెక్టర్ సముద్ర, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ లు ఈ చిత్రంలోని పాటలను, టీజర్ ను విడుదల చేశారు. ఇంకా, మా ఈ. సి. మెంబెర్ సీనియర్ ఆర్టిస్ట్ మాణిక్, నిర్మాత పద్మిని నాగులపల్లి, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్రతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పలువురు డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
అనంతరం హీరో శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. 2019 లో స్టార్ట్ అయిన మా మూవీ 2023 లో రిలీజ్ అవుతుంది అంటే ఈ సినిమాకు ఎంత స్ట్రగుల్ పడ్డామో మాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా మా నిర్మాత జహాన్ గారు ఈ సినిమాను ముందుకు తీసుకు వచ్చారు. ఇలాంటి మంచి కథలో నన్ను, సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.