వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా వాలంటీర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావువిజ్ఞప్తి చేశారు. ఒకవేళ పొరపాటున టిడిపి వస్తే మొదటి వేటు వాలంటీర్లపైనే పడుతుందని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో, దేనికి వేయకూదదో చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అదే విధంగా వాలంటీర్లకు కూడా ఉంటుందని, వారు రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
వాలంటీర్ కూడా ఓ పౌరుడేనని, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు, దానికి ప్రచారం చేసే హక్కు వారికీ ఉంటుందన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు. బాబు అధికారంలోకి వస్తే ముందు తుపాకీ పెలేది వాలంటీర్లమీదేనని, అందుకే ఆయన అధికారంలోకి రాకుందే ముందే వాలంటీర్లు పేల్చాలని, మన దగ్గర కూడా ఓటు అనే తుపాకీ ఉందని వ్యాఖ్యానించారు.