స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలోని సిఎస్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు,కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాలిన భుములు, వివిధ రాయితీలు,ఇతర ప్రోత్సాహకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఫ్యాకేజి ఇన్సెంటివ్ లకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలతో పాటు విధాన నిర్ణయాలకు చెందిన అంశాలపైన కమిటీ సమీక్షించింది.అదే విధంగా ఐటి అండ్ సి శాఖకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలు,ఇంధన శాఖకు సంబంధించిన అజెండా అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆయా పరిశ్రమలు,కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాకాలు తదితర అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఇంకా ఈసమావేశంలో పలు అంశాలపై కూడా సిఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వలవన్, కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ రావత్ పాల్గొనగా దృశ్య మాధ్యమం ద్వారా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు.అలాగే ఈసమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఎంఏయుడి కమీషనర్ ప్రవీణ్ కుమార్,పరిశ్రమల శాఖ కమీషనర్ స్రృజన,ఎపి మారిటైమ్ బోర్డు సిఇఒ షన్మోహన్,ఇతర అధికారులు పాల్గొన్నారు.