బాలకృష్ణ మాట్లాడడం మొదలుపెడితే.. ఎటు నుంచి ఎటు వెళుతుందో.. ఎక్కడ ఆగుతుందో వింటున్న వాళ్లకే కాదు.. మాట్లాడే ఆయనకు కూడా తెలియదు. ఈ మాటల్లో అప్పుడప్పుడు ఎదుటవారిని బాధపెట్టే మాటలు వచ్చేవి. ఇప్పుడు రెగ్యులర్ వస్తున్నాయి. మొన్నటికి మొన్న వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య మాట జారారు. ఆతర్వాత అక్కినేని అభిమానులు, అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదనడంతో.. పెద్ద వివాదానికి దారి తీసింది.
అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆఖరికి బాలయ్య స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కినేనిని బాబాయ్ అని పిలుస్తాను. ఆయనంటే గౌరవం. ఏదో అనుకోకుండా ఆ మాట వచ్చింది కానీ.. విమర్శించాలి అని అనలేదు అంటూ బాలయ్య వివరణ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా బాలయ్య మాటలతో ఆసుపత్రిల్లో పని చేసే నర్సుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక నర్సు అందాల గురించి బాలయ్య చేసిన కామెంట్స్ తో రాజకీయ వివాదం మొదలైంది. దాంతో, ఆయన సారీ కాని సారీ చెప్పారు.
నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను అని బాలయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే, పూర్తిగా సారీ కూడా చెప్పలేదు. కేవలం ఒకసారి యాక్సిడెంట్ జరిగితే బాలయ్య ఆసుపత్రిలో చేరేందుకు వెళ్ళాడట. కానీ, యాక్సిడెంట్ లో గాయపడినట్లుగా ఆసుపత్రిలో చెప్పొద్దని సలహా ఇచ్చారట. అబద్దం ఆడమని చెప్పారట. అయితే, బాలయ్య అక్కడ ఉన్న నర్స్ అందాలకు ఫిదా అయిపోయి నిజం చెప్పేశాడట. ఈ క్రమంలో ఆయన వాడిన పదాలు దీనమ్మ అది భలే ఉంది.. అన్నారు. దాంతో నర్సులు బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో, బాలయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా వివాదం రేగినప్పుడల్లా తన ఇంటెన్షన్ అది కాదు అంటూ ఇలాంటి ఒక స్టేట్మెంట్ వదులుతున్నారు. మరి.. బాలయ్య ఇలా మాట్లాడడం ఎప్పుడు ఆపుతారో..?