Monday, February 24, 2025
Homeసినిమాబాలయ్య, పూరి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

బాలయ్య, పూరి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆతర్వాత రీసెంట్ గా ‘వీరసింహారెడ్డి’ అంటూ వచ్చి మరో బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పటి వరకు బాలయ్య ఒక బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ సాధించడం అనేది జరగలేదు. ఫస్ట్ టైమ్ వరుసగా అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో బాలయ్య ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం.

ఇదిలా ఉంటే.. బాలయ్యతో పూరి జగన్నాథ్ ‘పైసా వసూల్’ అనే సినిమా చేయడం.. ఆ సినిమా అభిమానులకు బాగా నచ్చడం తెలిసిందే. అప్పటి నుంచి బాలయ్య, పూరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ‘లైగర్’ ప్లాప్ తర్వాత పూరి నెక్ట్స్ మూవీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు. అయితే.. ఆ స్టోరీ ఎవరి కోసం.. చిరంజీవి కోసమా..? ఆకాష్ కోసమా..? బాలయ్య కోసమా..? అనేది సస్పెన్స్ గా ఉండేది. కొన్ని రోజులు చిరంజీవి కోసమని ప్రచారం జరిగింది. ఆతర్వాత ఆకాష్ కోసమని ప్రచారం జరిగింది. బాలయ్య కోసమని కూడా ప్రచారం జరిగింది.

ఇటీవల ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో పూరి నెక్ట్స్ ఎవరితో అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. పూరి స్టోరీ రాయడం కంప్లీట్ అయ్యిందట. త్వరలోనే బాలయ్యను కలిసి ఈ కథను పూరి వినిపించబోతున్నాడు. పూరి కథలో మంచి డెప్త్ ఉందని తెలుస్తోంది. పైగా ఈ కథా నేపథ్యం కూడా చాలా కొత్తగా ఉంటుందట. అలాగే తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో మంచి ఎమోషన్ కూడా ఉంటుందట. కాగా సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్