Sunday, November 24, 2024
HomeTrending Newsదేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్ పోచారం

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్ పోచారం

కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక కళ్లు పోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అసెంబ్లీలో కంటివెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్, చైర్మన్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు ఎమ్మెల్యేలు పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది చెప్పారు. అసెంబ్లీలో ఆవరణంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు టెస్టింగ్ సెంటర్‌లో ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సూచించారు.

మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని ఎం.ఐ.ఎం శాసన సభ్యులు అభినందించారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలిగించే అవకాశం ఉందని ఏం ఐ ఎం ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎం ఐ ఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి,ముంతాజ్ ఖాన్ లను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్ ల వద్దకు స్వయంగా దగ్గర ఉండి తీసుకువచ్చి ఎమ్మెల్యేలకు పరీక్షలు చేయించిన ఆర్ధిక,వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు.

Also Read : కంటి వెలుగుకు విశేష స్పందన – సి.ఎస్ శాంతి కుమారి

RELATED ARTICLES

Most Popular

న్యూస్