తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేటి నుంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్ుతుంది. ఈరోజు ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెల 25వరకూ అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఉదయం పది గంటలకు కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి చౌరస్తాలో జరిగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు.
15రోజుల్లో 11వేల వీధి సభలకు బీజేపీ ప్లాన్ సిద్దం చేసింది. నేటి నుంచి 15రోజుల పాటు శక్తికేంద్రాల పరిధిలో 11వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. మెదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 800కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళికలు చేసిన కమలం నాయకత్వం… రాష్ట్రంలోని అగ్రనేతలకు అందరికి బాధ్యతలు అప్పగించింది.
సికింద్రాబాద్ – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,
సనత్నగర్ – బిజెపి జాతీయ నేత సునీల్ బన్సల్
వరంగల్ వెస్ట్ ఈటల రాజేందర్
జగిత్యాల ధర్మపురి అర్వింద్
ఉప్పల్ రఘునందనరావ్
మహబూబ్‌నగర్ డీకే అరుణ
మార్కెట్ యార్డ్స్, గ్రామ చౌరస్తా, జనసమూహం ఉండే ప్రదేశాల్లో బీజేపీ కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. కనీసం రెండు వందల మంది స్థానికులు పాల్గొనేలా ప్లాన్ చేస్తోన్న కమలం పార్టీ… రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, కేంద్ర పథకాలపై నేతలు వివరించనున్నారు. ప్రజా గోస బీజేపీ భరోసా పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బిజెపి శ్రేణులు చేరుకునేలా కార్యాచరణ రూపొందించారు.