గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్లుగా దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ జరుగుతోందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ 2022 దాటి.. 203-24 దాటేలోపు ఇండియా 5ట్రిలియన్స్ ఎకానమీ కంట్రీ అవుతుంది అని చెప్పారు. 5 ట్రిలియన్స్ అనేది పెద్ద జోక్. ఐదు ట్రిలియన్స్ కూడా చాలా తక్కువనే. ప్రస్తుతం ఇందులో చేరుకున్నది 3.3 ట్రిలియన్సే. అసలు రుగ్మత ఇది పెట్టుకొని పైకి లొల్లి చేస్తా ఎలా? రెండురెండు గంటల ఉపన్యాసం. సాయి సంసారి.. లచ్చిదొంగ.. వట్టిదే బొబ్బ. ఇది ఎవరికి, ఎందుకు పనికి వచ్చేది. వైఫల్యం ఉంటే ఎప్పుకోవాలి. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి చూస్తే అమెరికా ఆర్థిక శక్తి.. ఎకానమీ 25 ట్రిలియన్ డాలర్స్. చైనా ఎకానమీ 18.3 ట్రిలియన్స్, జపాన్ 4.3 ట్రిలియన్స్, జర్మనీ 4ట్రిలియన్స్, భారతదేశం 3.3 ట్రిలియన్స్ వద్ద ఉన్నది. ఎకానమీ ఉండేది వేరు.. అసలు కథ వేరు. ఫర్ క్యాపిటా వద్దకు వెళ్లితే రియల్ స్టోరీ తెలుస్తుంది. ప్రపంచంలో 192 దేశాలు ఉన్నాయని వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ పరిగణిస్తున్నాయి. ఇందులో భారతదేశం ర్యాంకు 139 స్థానంలో ఉంది. ఇంకా ఎంత అందంగా ఉన్నమో ఆలోచన చేయాలి. పక్కనే బంగ్లాదేశ్ ర్యాంకు 138, భూటాన్, శ్రీలంక ర్యాంకులకంటే భారతదేశం ర్యాంకు తక్కువగా ఉన్నది’ అని తెలిపారు.
తూ కిత్తా అంటే.. మై కిత్తా అంటున్నరు..
‘తూ కిత్తా అంటే.. మై కిత్తా, నువ్వు ఎన్ని కూలగొట్టినవ్ అంటే.. నువ్వు ఎన్ని కూలగొట్టినవ్.. అంటున్నరు. నువ్వు ఈ కేసులో.. ఆ కేసులో ఉంటున్నవ్ అనుకుడు ఇదే పనైపోయింది. ఈ రోజు ఈ విషయాలపై చర్చించకుండా, సీరియస్‌గా తీసుకోకుండా.. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లం, శాసనకర్తలుగా ఉన్న వాళ్లం ఓ రకమైన వల్గారిటీ వైపు శాసనసభలను, పార్లమెంట్‌ను తీసుకెళ్లి జబ్బలు చరిచి.. ఎదుటివారిని కించపరచడం, ఎదుటివారిని మాట్లాడనివ్వకుండా బుల్డోజ్ చేస్తున్నారు. నిన్న పార్లమెంట్‌లో ఎంపీ మాహువా మోయిత్రా మాట్లాడుతుంటే లొల్లి పెడుతున్నరు. పొగడడానికి కూడా సందర్భం ఉండాలి. అయ్యిందానికి కానిదానికి పొడిగితే నేను గొప్పోన్ని అనుకునే ప్రమాదం ఉంటది’ అన్నారు. మోదీకి చెప్పేవాళ్లు కూడా మంచిగ చేయాలని చెప్పకుండా.. బాగుంది బాగుందని మాజీ ప్రధాని అయ్యాక చెబుతారు. దిగిపోయినా మనకేం తక్కువ మాజీ ప్రధానిగా ఉంటారని చెబుతారు. అదానీ వ్యవహరంతో దేశం అట్టుడుకుతుంది. కేంద్రం గవర్నమెంట్ ఫర్ఫామెన్స్ లేదు’ లేదని విమర్శించారు.
2024 తర్వాత మొత్తం కుప్పే..
‘బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఇంగ్లిష్ చానల్ ఉంది. ఇందులో గోద్రా వ్యవహారంలో బీబీసీ డాక్యుమెంటరీని బ్యాన్ చేశారు. సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందిన అశ్వినీ ఉపాధ్యాయ అనే వకీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఇంత అహంకారమా? బీబీసీ అంటే జీన్యూస్..? ఈడీ, బోడీకి భయపడేందుకు. బీబీసీని బ్యాన్ చేయాలని బీజేపీ వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే.. దేశానికి అలంకారమా? ప్రపంచం మన గురించి ఏమనుకుంటది. ఇంత అసహన వైఖరా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? ప్రజాస్వామ్య ప్రియులు, సమాజ పురోగతిని కోరుకునేవారు ఆలోచించాలి. కొద్ది సందర్భాల్లో తప్పులు జరుగుతాయ్. తప్పు జరిగితే తప్పు జరిగిందని అని చెప్పాలి. ఈ జులూం ఎన్ని రోజులు ఉంటుంది. నేను వందశాతం చెబుతున్న 2024 దాటితే మొత్తం కుప్పే. బంగ్లా వార్ గెలిచిన తర్వాత ఇందిరాగాంధీని స్వయంగా అటల్ బిహార్ వాజ్‌పేయి భారతదేశ దుర్గామాత అని పార్లమెంట్‌లో పొడిగారు. ఒక అలహాబాద్ జడ్జిమెంట్ తర్వాత జరిగిన ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇందిరా గాంధీకి సమీపంలో ఎవరూ లేరన్న ఆలోచనలు, పత్రికా కథనాలు, కాలమిస్ట్‌లు కాలమ్‌లు రాసే క్రమంలో అలహాబాద్ కోర్టు జడ్జిమెంట్ మహా నాయకురాలి పరిస్థితిని గిల్లిపారేసింది దేశం. ఆ తర్వాత రెండేళ్లకే జనతా పార్టీ తప్పులు చేసే మళ్లీ ఇందిరాగాంధీనే తెచ్చి కూర్చోబెట్టింది ఈ దేశం. ప్రజాస్వామ్యం ఎవరూ శాశ్వతం కాదు. ప్రజల దయ, ఇష్టం ఉంటే, అవకాశం ఇస్తే పని చేస్తాం. లేకపోతే ఎవరికి తోచిన పని చేసుకొని బతకాలి. సంయమనం, సహనం ఉండాలి. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితులు లేవు. వీటిని సమాజం ఒప్పుకోవు. ప్రతీది మేం చేసేదే రైట్ అనే పద్ధతిలో గందరగోళ పరిస్థితి దేశంలో ఉన్నది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ ఎందుకు?
‘దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ కొనసాగుతున్నది. గుడ్డి ఎద్దు చేన్లో పడ్డట్లుగా సాగున్నది. రైళ్లు, విమానాలు, పోర్టులు, రోడ్లు, రైల్వేస్టేషన్లు పోయాయి. ప్రైవేటు రైలువస్తుంది. చివరికి ఎందుకు ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయాలి. కేంద్ర బడ్జెట్‌కు మించి ఆస్తులు ఉన్నయ్. 42లక్షల కోట్ల నుంచి 45లక్షల కోట్ల వరకు లావాదేవీలు చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సురెన్స్ కంపెనీ. ఎల్‌ఐసీ భారతీయ ఆత్మ, నమ్మకం. ఎందుకు అమ్మాలి? ఎంత మంది అడిగినా చెప్పరు. దీన్ని ఏమనుకోవాలి. సోషలైజేషన్ ఆఫ్ లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఇది మోదీ అనుసరిస్తున్న విధానం. ఇది ఏమాత్రం సరికాదు. ఇండియన్ ఏయిర్ లైన్స్ ప్రైవేటు కంపెనీ. టాటాలకు చెందిన కంపెనీ. 1948లో కొద్దిగా 49శాతం కొనుగోలు చేసి.. 1953లో నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం టాటాల నుంచి తీసుకొని ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ప్రభుత్వరంగంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు దాన్నే టాటాలకు ధారాదత్తం చేశాడు మోదీ. గవర్నమెంట్ బిజినెస్ చేయాలి. ఈటల రాజేందర్ ఫైనాన్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్ కూడా బడ్జెట్‌లో పెట్టారు. కొన్ని లాభాలు వచ్చే ఏరియా, ఒకచోట తక్కువ లాభాలు వచ్చే ఏరియా.. మరికొద్దిచోట్ల నష్టాలు వచ్చే ఏరియా ఉంటది. అన్నింటిని కలిపి సమ్మిళతం చేస్తూ ముందుకెళితే సరైంది. కానీ, గవర్నమెంట్‌ది బిజినెస్ కాదంటే కాని కిందపెట్టుడన్నట్టు. కాని గుంజినోడు సిపాయి కానీ.. కిందపెట్టినోడు సిపాయి అయితడా? గర్నమెంట్ నో బిజినెస్ అంటే తప్పించుకోవడమే. ప్రజల బాధలను బాధను పంచుకోవాలి.. దుమ్ము దులిపేసుకోవడం సరికాదు’ అన్నారు.