టెస్టుల్లో సైతం టీమిండియా టాప్ ప్లేస్ కు చేరుకుందని ప్రకటించిన నాలుగు గంటల్లోనే ఐసిసి ఆ ప్రకటన ఉపసంహరించుకుంది. సాంకేతిక తప్పిదాల వల్ల ఇండియా టెస్టుల్లో నంబర్ వన్ స్థానం చేరుకున్నట్లు ప్రకటించామని, అయితే ఆస్ట్రేలియానే ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతోందని వెల్లడించింది.
ఇప్పటికే టి 20లు, వన్డేల్లో టాప్ ప్లేస్ లో ఉన్న ఇండియా టెస్టుల్లో కూడా ఆ స్థానానికి చేరుకొని మొత్తం మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ పొజీషన్ చేరుకున్న జట్టుగా చరిత్ర సృష్టించిందని భారత క్రికెట్ ప్రేమికులు సంబరాలు చేరుకున్నారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవకుండానే … తప్పు జరిగినట్లు ఐసిసి చెప్పడంతో నిరాశకు గురయ్యారు. తాజా గణాంకాల ప్రకారం ఆసీస్ 126 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, 115 పాయింట్లతో ఇండియా రెండో ప్లేస్ లో ఉంది.
అయితే ఆసీస్ తో మరో మూడు టెస్టులు ఆడాల్సి ఉందని, వాటిలో కనీసం రెండిటిలో విజయం సాధించి టాప్ ప్లేస్ కచ్చితంగా సాధిస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.