మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. లంక ఇచ్చిన 113 పరుగుల విజయ లక్ష్యాన్నిఆసీస్ వికెట్ నష్ట పోకుండా 15.5 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లు అలేస్సా హీలీ 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 54; బెత్ మూనీ 53 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేశారు.
జిక్వేబెర్టాలోని సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఓపెనర్లు మాధవి 34; ఆటపట్టు 16; విష్మి గుణరత్నే24; నీలాక్షి డిసిల్వా 15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ కు పరుగులు రాబట్టడంలో లంక మహిళలు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో మేగాన్ స్కట్ 4; గ్రేస్ హారిస్ 2; ఎల్లిస్ పెర్రి, వారేహం చెరో వికెట్ పడగొట్టారు.
హీలేకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.