సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభం రోజున తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్నకు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసి ఆరోజు ఆర్ధరాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. నాటి నుంచి 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న కొద్ది సేపటి క్రితం మరణించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు.
గుండెపోటు కంటే బ్రెయిన్ డెడ్ సమస్య తారకరత్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. విదేశీ వైద్యులను సైతం రప్పించి చికిత్స అందించినా ఉపయోగంలేకుండా పోయింది. నందమూరి బాలకృష్ణ, తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, సమీప బంధువులు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని ఈ రాత్రికే హైదరాబాద్ కు తీసుకువస్తారని తెలిసింది.