ఎమ్మెల్యే శంకర్ నాయక్ నోరు అదుపులో పెట్టుకోవాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. ప్రజల పక్షాన నిలబడితే కొజ్జాలు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ సర్కిల్ వద్ద YSRTP భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపి కవితలపై నిప్పులు చెరిగారు.
వైఎస్ షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే….
శంకర్ నాయక్ అంటున్నాడు మేము కొజ్జాలం అంట. ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..? నువ్వు కాదారా కొజ్జా..? ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోక పోతే నువు కాదారా కొజ్జా..? రైతు రుణమాఫీ చేయక మీరు కోజ్జాలు కాక ఏమైతరు రా అని అడుగుతున్న. 6 నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాక ఏమైతర్రా అని అడుగుతున్నాం. మీకు పరిపాలన చేతనయ్యిందా..? ఒక మహిళను పట్టుకొని కొజ్జా అని అంటావా..? నువు కొజ్జా అంటే నేను ఊరుకోవాలా..? అసలు రాష్ట్రంలో హిజ్రాలకు కూడా గౌరవం ఉంది. వారు దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. వైఎస్సార్ బిడ్డ గుండెల్లో వారికి స్థానం ఉంది. ఈ ఎమ్మెల్యే కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చితే వాళ్ళను అవమాన పరిచినట్లే..?
మేము వలసదారులం అంట. మరి నీ భార్య ఎక్కడ నుంచి వచ్చింది ..? నెల్లూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నవు కదా. నీకు తెలంగాణపై అంత ప్రేమ ఉంటే.. నీ భార్యకు విడాకులు ఇవ్వు..నిజానికి నీ భార్య నీకు విడాకులు ఇవ్వాలి. ఒక IAS చెయ్యి పట్టుకున్న నాడే నీకు విడాకులు ఇవ్వాల్సి ఉంది. ఒకప్పుడు AE గా పని చేసి ఏసీబీలో పట్టుబడ్డాడట. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ శంకర్ నాయక్. ఈ లంచగొండి ఉద్యోగం పోగొట్టుకొని ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నాడు. లంచగొండి ఎమ్మెల్యే మొత్తం నియోజక వర్గాన్ని దోచుకున్నాడు. మొత్తం కబ్జాలు.గిరిజనుల భూములు కబ్జాలు,చెరువులు,శిఖం భూములు, అన్ని మాయం. గుట్కా మాఫియా,ఇసుక మాఫియా,PDS రైస్ దందా,బెల్లం మాఫియా ఇలా అన్ని మాఫియా లే. ప్రతి నెల మామూళ్లు టంచన్ గా రావాల్సిందేనట. ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం చేతకాలేదు.
ఇక మహబూబాబాద్ ఎంపీ కవిత..మహిళ..బాగానే ఉంది. 2009లో ఇదే నియోజక వర్గానికి పిలిచి మరి ఎమ్మెల్యే ను చేశారు. ఈ కవితకు రాజకీయ భిక్ష పెట్టింది YSR. ఈ కవిత రాజకీయ పుట్టుక కారణం YSR. YSR మీద కృతజ్ఞత లేకుండా ఆయన బిడ్డ పై హీనంగా మాట్లాడావు. నీ విజ్ఞతకే వదిలి వేస్తున్న. కానీ ఒక్క మాట అడుగుతున్న. నీకు ఏడాదికి 5 కోట్లు ఎంపీ లాడ్స్ వస్తున్నాయి. వాటితో ఎం చేశావో శ్వేత పత్రం విడుదల చెయ్యి. నన్ను తిట్టడం కాదు..ఈ పార్లమెంట్ నియోజక వర్గానికి ఏం చేశావో చెప్పు. ఇదే మానుకోట వేదికగా సీఎం 2018 లో పోడు పట్టాలు ఇస్తా అని హామీ ఇచ్చాడు. ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంట అన్నారు. చీఫ్ సెక్రటరీ నీ తీసుకొని వస్తా అన్నారు. అధికారంలో వచ్చిన 4 ఏళ్లలో ఒక్క పట్టా ఇవ్వలేదు. ఈ జిల్లాలో 1 లక్షా 40 వేల ఎకరాలకు పట్టాలు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. ఒక్క పట్టా ఇచ్చింది లేదు కానీ.. అసెంబ్లీలో గిరిజన బిడ్డలను అవమాన పరిచే విధంగా మాట్లాడారు. పోడు భూములు గిరిజనుల హక్కులు కాదట. దయతలచి ఇస్తే తీసుకోవాలట. ముఖ్యమంత్రిగా ఉండి ఇదేనా మాట్లాడేది.
ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేస్తా అని హామీ ఇచ్చారు. ఏనాడైనా కేంద్రంతో రిజర్వేషన్లు పై పోరాటం చేశాడా..? ప్రధాని మన రాష్ట్రం కోస్తే కనీసం అడిగే మొఖం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రెండు పంటలు నీళ్ళు అన్నారు. ఒక్క చుక్క నీరు ఇచ్చింది లేదు..? పైగా కాళేశ్వరంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మిడ్ మానెర్ నింపి నేరుగా మహబూబాబాద్ పట్టణానికి నీళ్ళు ఇస్తున్నారట. చెవిలో పూలు, క్యాబేజీలు పెడుతున్నారు. గిరిజనులకు పాల్ టెక్నిక్ కాలేజి అన్నారు ఇవ్వలేదు. హార్టికల్చర్ కాలేజీ అన్నారు ఇవ్వలేదు. గిరిజనులకు ఇంజనీరింగ్ కాలేజీ అన్నారు.. రాలేదు. తెలంగాణ సొమ్ము మొత్తం బురదలో పోశారు.