ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్చరించింది.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న బైక్‌లను ట్యాక్సీలుగా ఉపయోగించడం నిషేధమని పేర్కొన్నది. బైక్ ట్యాక్సీలు నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఏడాదిపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని వెల్లడించింది. బైక్ ట్యాక్సీ నడిపినవారి డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలలు రద్దు చేస్తామని పేర్కొన్నది.