ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు కమిషర్లుగా సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది.
ఉల్చాల హరిప్రసాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌నుంచి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్ అయిన కాకర్ల చెన్నారెడ్డి పలు జిల్లాల కోర్టుల్లో, రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో గత 15 ఏళ్ళుగా న్యాయవాదిగా ఉన్నారు.
సచివాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యురాలు మేకతోటి సుచరిత, కమిటీ సభ్యులు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడి) ప్రవీణ్ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ పేర్లను గవర్నర్ ఆమోదం కోసం పంపారు.