‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరంజీవిలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో తను నెక్ట్స్ ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో చిరుకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకనే ‘భోళా శంకర్’లో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత పక్కా మాస్ డైరెక్టర్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకే కథలు రెడీ చేయమని పూరి జగన్నాథ్, వివి వినాయక్ లకు సూచించారు.
ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలతో బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన వి.వి.వినాయక్‌తో సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. వినాయక్ ఇప్పుడు సరైన ఫాంలో లేడు. ఖైదీ నంబర్ 150 మినహా చాలా ఏళ్ల నుంచి మంచి హిట్ లేదు. ఎప్పటి నుంచో ఛత్రపతి హిందీ రీమేక్ కోసం పని చేస్తున్నాడు కానీ.. దాని గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
అయితే.. చిరు మాత్రం తనకు పెద్ద హిట్లిచ్చాడన్న కృతజ్ఞతతో వినాయక్‌తో పని చేయడానికి ముందుకొచ్చారు అంటున్నారు. వెంకీ కుడుముల, మారుతి లాంటి దర్శకులకు ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ.. తీరా స్క్రిప్టు దగ్గరికి వచ్చేసరికి సంతృప్తి చెందక సినిమాలు క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు చిరు కథ లేకుండానే వినాయక్‌కు మాట ఇచ్చారట కానీ తీరా కథ సంగతి వచ్చేసరికి ఏమవుతుందో చెప్పలేం. ఎందుకంటే ‘గాడ్ ఫాదర్’ కు వినాయక్ ని అనుకున్నారు. ఆయన చేసిన మార్పులు చేర్పులు నచ్చకపోవడంతో నో చెప్పారు. అందుచేత వినాయక్ కి ఓకే చెప్పినా ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.