Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్ICC Women’s T20 World Cup: హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియా

ICC Women’s T20 World Cup: హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియా

మహిళల టి 20 వరల్డ్ కప్-2023ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆతిథ్య సౌతాఫ్రికాపై 19 పరుగులతో విజయం సాధించి ఆరోసారి ఈ కప్ గెల్చుకున్న జట్టుగా రికార్డు సృష్టించడంతో పాటు వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఇది ఆ జట్టుకు రెండో హ్యాట్రిక్… 2010, 2012, 2014 సంవత్సరాల్లో వరుసగా గెల్చుకున్న ఆసీస్ 2016లో రన్నరప్ గా నిలిచింది. ఆ తరువాత 2018, 2020, 2023ల్లో వరుసగా గెల్చుకుంది.

నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి 156 పరుగులు చేసిన ఆసీస్ మహిళలు ఆ స్కోరును కాపాడుకున్నారు. సౌతాఫ్రికా ఓ దశలో విజయం దిశగా సాగినప్పటికీ… 109 పరుగుల వద్ద ఓపెనర్ లారా వోల్వార్ద్ట్ వికెట్ కోల్పోయిన తరువాత మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్ళింది.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి వికెట్ కు 36 పరుగులు (అలిస్సా హేలీ-18) చేసింది. మరో ఓపెనర్ బెత్ మూనీ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆష్లీ గార్డ్ నర్-29 రన్స్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలర్లలో శబ్నిం ఇస్మాయిల్, మారిజానె కాప్ చెరో రెండు; మల్బా-నడిన్ క్లార్క్ చెరో వికెట్ పడగొట్టారు.

157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ వోలార్ద్ట్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. క్లో టైరన్ 25 పరుగులు చేసింది. మిగిలిన వారు విఫలంకావడంతో ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయగలిగింది.

ఆసీస్ బౌలర్లలో మేగాన్ స్కట్, గార్డ్ నర్, డార్సీ బ్రౌన్, జెస్ జోనస్సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

బెత్ మూనీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ , ఆష్ గార్డ్ నర్ కు ‘ప్లేయర్ అఫ్ ద టోర్నమెంట్’ లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్