మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్ లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను వివరించి తద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును వేదిక చేసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
కార్యక్రమాల షెడ్యూల్, వేదిక వద్ద జరుగుతున్న పనులు, ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తల వివరాలను అధికారులు సిఎంకు తెలిపారు. సదస్సు నిర్వహణలో సిఎం కొన్ని సూచనలు చేశారు.
- ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభం.
- 10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న సదస్సు.
- కీలక అంశాలపై సదస్సునుద్దేశించి మాట్లాడనున్న పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు.
- తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.
- దీనితర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు.
- వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపనున్న సీఎం.
- సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
- తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం.
- తొలిరోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు, విందులో పాల్గోనున్న ముఖ్యమంత్రి.
- రెండోరోజున ముగింపు సెషన్.పాల్గోనున్న పలువురు ప్రముఖులు.
- రెండోరోజునా పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.
ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా షెడ్యూల్ ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. పాల్గొన్నారు.