Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ గురించి క్లారిటీ ఇచ్చిన హెచ్సీఏ

ఎన్టీఆర్ గురించి క్లారిటీ ఇచ్చిన హెచ్సీఏ

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్.. ఆర్ఆర్ఆర్ మూవీకి నాలుగు అవార్డులు అందించింది. అయితే.. ఈ వేడుకలో రామ్ చరణ్‌, రాజమౌళి, సెంథిల్ కుమార్, కీరవాణి పాల్గొన్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ సందడి చేయడం.. సినీ, రాజకీయ ప్రముఖులు రామ్ చరణ్ ని అభినందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ చరణ్ ను అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఎక్కడా ఎన్టీఆర్ గురించి ప్రస్తావన లేదు. అలాగే అమెరికాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వెంకటేష్.. అన్ని అవార్డులు చరణ్‌ కే అంటూ అభినందించారు.

ఇలా ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ చరణ్‌ కే అవార్డులు ఇవ్వడం.. ఆయన్నే అందరూ అభినందించడంతో ఎన్టీఆర్ అభిమానులు బాగా ఫీలయ్యారు. అందుకనే.. కావాలని మా హీరోని పక్కన పెట్టారు. రామ్ చరణ్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ.. హాట్ టాపిక్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ కు ఎందుకు అవార్డ్ ఇవ్వలేదు.? ఎందుకు అవార్డుల ప్రదానోత్సవంకు పిలవలేదు.? అని అభిమానులు సోషల్ మీడియా ద్వారా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ని ప్రశ్నించారు.

దీంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్సీఏ) ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు సపోర్టర్లకు బహిరంగ లేఖ లాగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాము జూనియర్ ఎన్టీఆర్ ను తమ హాలీవుడ్  క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ కి హాజరుకావాలని ఆహ్వానించాం కానీ.. ఆయన ఇండియాలో కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడని అందుకే ఆయనని రాలేదని చెప్పారు. మా నుంచి ఆయనకు అందాల్సిన అవార్డులు త్వరలోనే అందుతాయని పేర్కొన్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మీ సపోర్ట్ కి ప్రేమకి థాంక్యూ అని చెబుతూ ఒక చిన్నపాటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి.. దీంతో అయినా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.

Also Read: ఎన్టీఆర్ కి కోపం వచ్చేలా చేసిన వెంకీ, పవన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్