Sunday, November 24, 2024
HomeTrending Newsఎంపి సంతోష్ కను సన్నల్లోనే ఇసుక మాఫియా - రేవంత్ రెడ్డి

ఎంపి సంతోష్ కను సన్నల్లోనే ఇసుక మాఫియా – రేవంత్ రెడ్డి

బీఆరెస్ నాయకులు సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని అంతమొందిస్తున్నారని ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ రోజు కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులోభాగంగా హుజురాబాద్ నియోజకవర్గం చెల్పూర్ ఇసుక రీచ్ సందర్శించిన రేవంత్ రెడ్డి…కెసిఆర్ పాలనపై దుమ్మెత్తి పోశారు. జోగినపల్లి సంతోష్, అతని తండ్రి రవీందర్ రావు బినామీ పేర్లతో వందల కోట్ల దోపీడీకి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకే పర్మిట్ తో నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారు.ఈ దోపిడీని బాహ్య ప్రపంచానికి చూపించేందుకే ఇక్కడకు వచ్చామని స్పష్టం చేశారు.
ఇసుక తీయడానికి జేసీబీలను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని, అధికారులతో చర్చిద్దామనుకుంటే ఒక్క అధికారి లేడని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇసుక డంప్ లు ఉన్న ఈ ప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా…ఇది ఒక ప్రయివేటు సామ్రాజ్యంగా మారిందన్నారు. ఇసుక తరలింపును అడ్డుకున్నవారిని పోలీసులు హెచ్చరించారని ఇక్కడి రైతులు చెబుతున్నారని, పోలీసులు ఇసుక మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారు.పిర్యాదు చేసిన వారిపైనే వారు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీతో కేసీఆర్ కు ఉన్న చీకటి అనుబంధం ఏమిటో తేలాలి.ఇది ఇలాగే సాగితే ఇక్కడి ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా… ప్రభుత్వ అక్రమ అనుమతులు రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఇప్పటికైనా ఈటెల, బండి సంజయ్ ఈ దోపిడీపై స్పందించాలి.ఈ దోపీడీని అడ్డుకునేందుకు వారి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదంటే.. బీఆరెస్, బీజేపీ బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆనారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్