రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లాంఛనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జిఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు, అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతా రెడ్డి, భరత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా, కియో, ఇండియా సిమెంట్స్, సెంచరీ ఫ్లై వుడ్ కంపెనీల ప్రతినిధులు ప్రారంభ సదస్సులో పాల్గొన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన జ్యోతి ప్రజ్వలనకు అతిథులను ఆహ్వానించగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. జవహర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ లు అతిథులకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఆ తర్వాత పారిశ్రామిక వేత్తలు ప్రసంగించారు. సదస్సు కొనసాగుతోంది.