Sunday, June 7, 2026
HomeTrending Newsతెలంగాణ తల వంచదు - ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ తల వంచదు – ఎమ్మెల్సీ కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను అని క‌విత పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎమ్మెల్సీ క‌విత ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టింది.

ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Also Read :  ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular