అహ్మదాబాద్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆచి తూచి ఆడుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల 255 నష్టానికి పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ (104) సాధించి అజేయంగా నిలిచాడు.
తొలి రెండు సెషన్స్ నెమ్మదిగా ఆడిన ఆసీస్ టీ విరామం తర్వాత కాస్త వేగం పెంచింది. లంచ్ విరామానికి 2 వికెట్లకు 75; టీ విరామానికి రెండు వికెట్లకు 149 పరుగులు చేయగలిగింది. చివరి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయి 106 రన్స్ సాధించింది.
ఉదయం 61 పరుగుల వద్ద మొదటి వికెట్ (ట్రావిస్ హెడ్-32) కోల్పోయిన ఆసీస్ ఆ కాసేపటికే రెండో వికెట్ (లబుషేన్-3) కూడా కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 38; పీటర్ హాండ్స్ కాంబ్-17 రన్స్ చేసి ఔటయ్యారు.
షమీ 2; అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
ఖవాజా-104; కామెరూన్ గ్రీన్-49 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read : Border–Gavaskar Trophy: మొదలైన నాలుగో టెస్ట్: హాజరైన ఇద్దరు ప్రధానులు