Saturday, November 23, 2024
HomeTrending Newsఈడి విచారణకు హాజరైన కవిత

ఈడి విచారణకు హాజరైన కవిత

ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. కవిత విచారణ నేపథ్యంలో సీఎం నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడి ఆమెకు మద్దతు తెలిపారు. అలాగే అబ్దుల్ కలాం రోడ్ లోని ఈడీ హెడ్ ఆఫీస్ పరిధిలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో కవితతో ఈడి కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆమె భర్త అనీల్, కవిత న్యాయవాదులు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.

మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు, పలువురు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత ఈడీ విచారణపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.

Also Read : ఈడీ, సీబీఐలకు భయపడేది లేదు -కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్