Friday, October 18, 2024
HomeTrending Newsరేవంత్, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారు - వైయస్ షర్మిల

రేవంత్, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారు – వైయస్ షర్మిల

కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. 2జీ, కోల్ గేట్ స్కాంల కన్నా ఇదే పెద్దదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి విచారణ జరిపించాలని డిమాండ్ తో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైయస్ షర్మిల ధర్నా నిర్వహించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు వైయస్ షర్మిల ర్యాలీగా వెళ్ళగా మధ్యలోనే బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. వైయస్ షర్మిలని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద వైయస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు.

వైయస్ షర్మిల విమర్శల్లో ముఖ్యాంశాలు …

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేలాది కోట్లు కేసీఆర్ దోచుకున్నారు. 18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 1.5లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. పారింది 18లక్షల ఎకరాలు కాదని 1.5లక్షల ఎకరాలే అని అసెంబ్లీలో బీఆర్ఎస్ మంత్రే ఒప్పుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1.20లక్షల కోట్లలో దాదాపు రూ.లక్ష కోట్లు కేంద్ర సంస్థలే రుణాలు ఇచ్చాయి. పవర్ కార్పొరేషన్ రూ.38వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూ.30వేల కోట్లు, పీఎన్ బీ రూ.11వేల కోట్లు, నాబార్డ్, ఇతర సంస్థలు కలిపి రూ.20వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి. ఈ సొమ్మంతా దేశ ప్రజలదే.. అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం.

కాళేశ్వరం విఫలమైన ప్రాజెక్టు.. రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేస్తే మూడేండ్లకే మునిగిపోయింది. దేశంలోని ప్రతి పౌరుడికి కాళేశ్వరం అవినీతిని తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిబంధనలన్నీ గాలికి వదిలేశారు. ఎత్తిపోతల అవసరం లేకున్నా పెద్ద పెద్ద మోటార్లతో నీళ్లు తోడారు. రూ.1600 కోట్లతో కొనుగోలు చేసిన మోటార్లకు రూ.7వేల కోట్ల లెక్కచూపారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేశారు. 18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. ప్రతి ప్యాకేజీలో అవినీతి జరిగింది. కాళేశ్వరంలో మోటార్లకు అయ్యే కరెంట్ బిల్ ఖర్చే ఏడాదికి రూ.3వేల కోట్లు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పి, అర టీఎంసీ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఒక్క ఏడాది కూడా సరిగ్గా నీళ్లు ఎత్తిపోయలేదు.. ఇది బోగస్ ప్రాజెక్టు. కాళేశ్వరం అవినీతిపై ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు, మెగాకు అమ్ముడుపోయాయి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారు. అందుకే ఆ పార్టీలు కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నించడం లేదు. రాష్ట్రంలో కాదు.. దేశంలోనే కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ అని వైయస్ షర్మిల అన్నారు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్