Saturday, November 23, 2024
HomeTrending Newsబడ్జెట్ పై నిరసన - టిడిపి సభ్యుల సస్పెన్షన్

బడ్జెట్ పై నిరసన – టిడిపి సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు నేడు కూడా సస్పెండ్ అయ్యారు. ప్రశ్నోత్తరాల తర్వాత కాసేపు టీ విరామం ఇచ్చారు. పది గంటల సమయంలో ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు. బుగ్గన ప్రారంభించిన కాసేపటికే టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఈ దశలో సిఎం జగన్ జోక్యం చేసుకొని బడ్జెట్ స్పీచ్ ఇంకా మొదలు కాకముందే ఇలా చేయడం సరికాదని, వారికి బడ్జెట్ స్పీచ్ వినే ఓపిక లేనట్లుగా ఉందని, అందుకే అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులను సస్పెండ్ చేసి బడ్జెట్ ను కొనసాగించాలని ప్రతిపాదించారు.  టిడిపి సభ్యులను స్పీకర్ ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం బుగ్గన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అంతకుముందు టిడిపి సభ్యులు బడ్జెట్ పై తమ నిరసన వ్యక్తం చేస్తూ సచివాలయంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ఏపీలో దివాలా బడ్జెట్, జగన్ రెడ్డి  కళ కళ- ప్రజలు గిల గిల అనే బ్యానర్ తో వారు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.

ఆర్ధిక ఎమర్జెన్సీ దిశగా ఆంధ్ర ప్రదేశ్ సాగుతోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగేళ్ళలో రాష్ట్రానికి 10.50 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, పేదల సంక్షేమానికి లక్షన్నర కోట్లరూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మిగిలిన నిధులు ఏమయ్యాయని అచ్చెన్న ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ళలో తొమ్మిది

Also Read : AP Budget 2023-24: విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: బుగ్గన

RELATED ARTICLES

Most Popular

న్యూస్