విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్ మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన కింద ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించిన నిధులను తిరువూరులో జరిగే కార్యక్రమంలో విద్యార్ధుల తల్లుల అకౌంట్లలో జమచేస్తారు, 9.86 లక్షల మంది విద్యార్ధులకు రూ. 698.68 కోట్ల లబ్ధి చేకూరనుంది.
2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 13,311 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అర్హులందరికీ పారదర్శకంగా పథకాలు అందిస్తూ వస్తోన్న ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలపై గత 45 నెలల్లో చేసిన వ్యయం మొత్తం రూ. 57,642.36 కోట్లు అని వెల్లడించింది.