Sunday, November 24, 2024
HomeTrending NewsDelhi Budget: బడ్జెట్‌ కు అనుమతించండి - కేజ్రివాల్

Delhi Budget: బడ్జెట్‌ కు అనుమతించండి – కేజ్రివాల్

ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను నిలిపివేయడం ఇదే తొలిసారి అన్నారు. ఢిల్లీ ప్రజలపై మీకెందుకు కోపం అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారనీ, దయచేసి త‌మ బడ్జెట్ ను ఆమోదించండని ఆయ‌న కోరారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ను క్లియర్ చేయడానికి ముందు… మౌలిక సదుపాయాల కంటే ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చు ఎందుకు ఎక్కువ ఉందో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం వివరణను కేంద్రం కోరింది.

ఢిల్లీ బ‌డ్జెట్‌ను ఆప‌కండి అంటూ ఆయ‌న త‌న లేఖ‌లో ప్ర‌ధానిని అభ్య‌ర్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రం మ‌ధ్య వివాదం చెల‌రేగుతున్న నేప‌థ్యంలో .. ఆప్ స‌ర్కార్ రాష్ట్ర బడ్జెట్‌ను నిలిపివేసింది. వివిధ రంగాల కేటాయింపుల విష‌యంలో కేంద్రం, ఢిల్లీ మ‌ధ్య వివాదం చెల‌రేగుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త 75 ఏళ్ల‌లో తొలిసారి ఓ రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌కుండా అడ్డుకున్నార‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ వాసుల‌తో మీరెందుకు ఇంత అప్‌సెట్‌గా ఉన్నార‌ని, ప్లీజ్ ఢిల్లీ బ‌డ్జెట్‌ను ఆప‌కండి, చేతులు జోడించి న‌మ‌స్క‌రిస్తున్నా, బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఢిల్లీ ప్ర‌జ‌లు కోరుతున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ త‌న లేఖ‌లో తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌కుండా కేంద్ర హోంశాఖ అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది. అడ్వ‌ర్టైజ్మెంట్ల‌కు అధిక కేటాయింపులు ఉన్నాయ‌ని, కానీ అభివృద్ధి ప‌నుల‌కు, మౌళిక స‌దుపాయాల కోసం కేటాయింపులు లేవ‌ని ఆప్ స‌ర్కార్‌పై కేంద్రం ఆగ్ర‌హంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్