Thursday, May 30, 2024
HomeTrending NewsKota Srinivasa Rao : వదంతులు నమ్మొద్దు: కోట వీడియో సందేశం

Kota Srinivasa Rao : వదంతులు నమ్మొద్దు: కోట వీడియో సందేశం

తాను క్షేమంగానే ఉన్నానని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.  నేటి ఉదయం లేచి కుటుంబ సభ్యులతో రేపటి ఉగాది పండుగ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నానని, అదే సమయంలో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో తాను మృతి చెందినట్లు వచ్చిన వార్త చూసి చాలా మంది ఫోన్లు చేయడం మొదలు పెట్టారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కనీసం 50 ఫోన్లకు తాను జవాబిచ్చానన్నారు.

ఓ పదిమంది పోలీసులతో కూడిన వ్యాన్ కూడా తన ఇంటికి వచ్చిందని,  ఆ వార్త తెలిసిన తరువాత అనేక మంది ప్రముఖులు ఇక్కడకు వస్తారు కాబట్టి  భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు వారు వచ్చిన విషయం తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యానని కోట వాపోయారు.

ప్రజలు ఇలాంటి వార్తలు నమ్మవద్దని, ఇలా ప్రచారం చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోట విజ్ఞప్తి చేశారు. డబ్బు సంపాదించడానికి ఇంకా ఎన్నో ఛండాలమైన మార్గాలు ఎన్నో ఉన్నాయని, ఇలా చేయడం సరికాదని హితవు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్