టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే సిట్ నోటీసులు తనకు అందలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే మరోసారి నోటీసులు జారీచేసి ఈ నెల 26న హాజరుకావాలని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిట్ అధికారులు మాట్లాడుతూ.. సంజయ్ పత్రికాముఖంగా నమ్మలేని నిజాలు అంటూ ప్రకటించారు. వారి ముందున్న వాస్తవాలు, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో సిట్‌కు అందిస్తే విచారణ సజావుగా సాగుతుందన్నారు.
సంజయ్‌కి నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ అధికారప్రతినిధి సంగప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగతా పార్టీల లాగా మా పార్టీ కాదని.. తమది సిద్ధాంతంపై, క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. మిగతా పార్టీల సభ్యుల లాగా తమ సభ్యులు వ్యవహరించరని, చట్టసభల సమావేశాలు జరుగుతున్న సమయంలో కచ్చితంగా హాజరవుతారన్నారు.
కానీ సిట్ అధికారులు నోటీసులు గోడకు, మీ డోర్‌కు అంటించామని చెప్పడం సరికాదన్నారు. ఇవాళ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని, వాటిని తీసుకున్నామన్నారు. చట్టంపై తమకు గౌరవం ఉన్నదని నోటీసులపై మా న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరొకరి అరెస్టయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట ఉపాధి మామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. గ్రూప్-1 పరీక్ష పేపర్ కొనుగోలు చేసిన ప్రశాంత్ 100పైగా మార్కులు తెచ్చుకున్నట్టు సిట్ ఆధారాలు సేకరించింది.
Also Read : TSPSC: పేపర్ లీకేజీపై నివేదికకు గవర్నర్ ఆదేశం