Tuesday, April 15, 2025
HomeTrending NewsHyderabad Metro: మెట్రో ప్రయాణికులకు చేదువార్త

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు చేదువార్త

హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం ప్రయాణికులకు కొత్త సంవత్సరంలో చేదువార్త అందించింది. మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిస్తున్న రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి కేవీబి రెడ్డి వెల్ల‌డించారు. మెట్రో చార్జీలలో కార్డు మరియు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఉపసంహరించినట్లు తెలిపారు.

అయితే.. రోజులో ఆరు గంటలు మాత్రమే 10% రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ రాయితీ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఉంటుందన్నారు. రద్దీ సమయాల్లో రాయితీ వర్తించదని స్పష్టం చేశారు.

గతంలో ఉన్న సువర్ణ సేవర్ ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు ఈ ఆఫ‌ర్ కింద‌ 59 రూపాయలు తీసుకున్న మెట్రో ఇకపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు 99 రూపాయలుగా ఉంటుంద‌ని తెలిపారు.

అయితే.. ముందుగా సూచించిన సెలవు దినాలలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారన్నారు. అదేవిధంగా కొత్త స్మార్ట్‌ కార్డు ధరను రూ.50 నుంచి రూ.100కు పెంచారు.

Also Read : ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ

RELATED ARTICLES

Most Popular

న్యూస్