ఆర్టికల్ 293(3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అపులకు కేంద్ర అనుమతి తప్పనిసరి అని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఏ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నా గ్యారంటీ ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఆ రుణాలను ఎలా రికవరీ చేస్తారని ప్రశ్నించారు. రుణాలకు గ్యారంటీ అవసరం లేదన్న ప్రభుత్వం ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు.
ఆదాయ మార్గాలు పెంచకుండా అప్పులతో పాలన ఎన్నాళ్ళు సాగిస్తారని, సంక్షేమం కోసం చేసిన ఖర్చుతో ఆర్ధికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని యనమన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇష్టానుసారం ఖర్చు చేసి రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం సృష్టించారని, రాష్ట్రాన్ని దివాలా తీయిన్చారని విమర్శించారు.