Wednesday, November 27, 2024
HomeTrending NewsGajjala Satyam: అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు - జగదీష్ రెడ్డి

Gajjala Satyam: అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు – జగదీష్ రెడ్డి

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతి లోకి రావడం అభినందనీయమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి, 17 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవించి విడుదల అయి జనజీవన స్రవంతి లోకి వచ్చిన మాజీ మావోయిస్టు గజ్జల సత్యం రెడ్డి మంగళవారం  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన ఉద్యమం అనుభవాలు,రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి, అమలౌతున్న సంక్షేమ పథకాలు మంత్రి జగదీష్ రెడ్డి సోదాహరణంగా వివరించారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో మీలాంటి వారు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి మాజీ మావోయిస్టు సత్యం రెడ్డికి సూచించారు. మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి,సీనియర్ టి ఆర్ యస్ నేత నామిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు -మాజీ మావోయిస్టు సత్యం రెడ్డి

తెలంగాణ ఏర్పాటుకు ముందు తరువాత ఈ ప్రాంతంలో పెద్ద మార్పు సంభవించిందని మాజీ మావోయిస్టు సత్యం రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యమం లోకి వెళ్లేముందు ఉన్న తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు పోలికే లేదని ఆయన చెప్పారు. తెలంగాణ అన్ని రంగాలలో త్వరితగతిన అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు చూశానని ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఆయా రాష్ట్రాలలో లేదని ఆయన తెలిపారు.

Also Read : Save Tiger:పులుల రక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్