Sunday, November 24, 2024
HomeTrending NewsTelangana Villages: తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట

Telangana Villages: తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట

జాతీయ పంచాయ‌తీ అవార్డుల్లో తెలంగాణ ప‌ల్లెలు స‌త్తా చాటాయి. దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌తీ స‌త‌త్ వికాస్ పుర‌స్కారాల్లో తెలంగాణకు అత్య‌ధిక అవార్డుల‌ను గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 పుర‌స్కారాల‌ను తెలంగాణ ప‌ల్లెలు కైవ‌సం చేసుకున్నాయి.

ఆరోగ్య పంచాయ‌తీ విభాగంలో మొద‌టి స్థానం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని గౌత‌మ్‌పూర్‌కు ద‌క్కింది. త‌గినంత నీరు క‌లిగిన పంచాయ‌తీ విభాగంలో జ‌న‌గామ జిల్లా నెల్లుట్ల‌కు ప్ర‌థమ‌స్థానం ల‌భించింది. సామాజిక భ‌ద్ర‌తా విభాగంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కొంగ‌ట్‌ప‌ల్లి మొద‌టి స్థానంలో నిలిచింది. మ‌హిళా స్నేహ పూర్వ‌క విభాగంలో సూర్యాపేట జిల్లా ఐపూర్ మొద‌టి స్థానంలో నిలిచింది. పేద‌రికం లేని, మెరుగైన జీవ‌నోపాధి పంచాయ‌తీ విభాగంలో జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని మాన్‌దొడ్డి గ్రామ‌పంచాయ‌తీకి రెండో స్థానంలో నిలిచింది. పంచాయ‌తీ విత్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా చీమ‌ల్దారి గ్రామానికి రెండో స్థానం ల‌భించింది. ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త విభాగంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా సుల్తాన్‌పురి మూడో స్థానం ల‌భించింది. స్వ‌యం స‌మృద్ధి మౌలిక స‌దుపాయాల విభాగంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట‌కు మూడోస్థానం లభించింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్