Sunday, November 24, 2024
HomeTrending NewsMallanna Sagar:మల్లన్నసాగర్ ట్రయల్ రన్

Mallanna Sagar:మల్లన్నసాగర్ ట్రయల్ రన్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా కుకుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో వాటర్ ట్రీట్ మెంట్ 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1212 కోట్ల రూపాయలతో రోజుకి 540 మిలియన్ లీటర్లను శుద్ధి చేయడానికి రాష్ట్రంలోనే అతి పెద్దదిగా దీన్ని నిర్మించారు. ఈ ప్టాంట్ ను నీటి శుద్దికరణ కోసం వాడనున్నారు. సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాల వాసులకు భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తప్పనున్నాయి. నాలుగు జిల్లాలకు తాగు నిరందించే మల్లన్న సాగర్ ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా మంగోల్ లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉపయోగకరమైనదని మంత్రులు అన్నారు.

ఆ తర్వాత సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన 548 నీటి శుద్దీకరణ కేంద్రానికి నీటిని సరఫరా చేసే పంపుల ట్రయల్ రన్ కార్యక్రమంలో  సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇంజనీరింగ్ చీఫ్ కృపాకర్ రెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పలువురు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఎత్తున పాల్గొన్నారు భగీరథ పథకంలో భాగంగా రాయల్ రాయల్ రన్ లో వచ్చిన వాటర్ ను ప్రత్యేక పూజలు చేసి మంత్రులు విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్