Sunday, November 24, 2024
HomeTrending NewsJyothirao Pule: బిసి కులగణనపై అధ్యయనం: చెల్లుబోయిన వేణు

Jyothirao Pule: బిసి కులగణనపై అధ్యయనం: చెల్లుబోయిన వేణు

రాష్ట్రంలోని 139 బిసి కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బిసి గణన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని బిసి సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. దీని కోసం కులగణన చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలు మనందరికీ ఆచరణీయమని అన్నారు. ఆయన అడుగు జాడల్లో సిఎం జగన్ నడుస్తూ పూలే వారసుడిగా నిలిచారన్నారు. దేశంలోనే అందరి కంటే ముందుగా మన రాష్ట్రంలోనే కులగణన చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రి భాయ్‌ పూలేలు బీసీల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.  జగన్‌ నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆశయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తోందని చెప్పారు.   మిగిలిన రాష్ట్రాలు కూడా బీసీల అభ్యున్నతికి  మనం తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. బీసీలకు ఏ ఒక్క మేలూ చేయని చంద్రబాబు కూడా బీసీలపై చర్చకు సిద్ధమా అంటున్నారని, బీసీలంతా గళమెత్తి బాబుకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని జోగి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్