Saturday, November 23, 2024
HomeTrending NewsJapan PM: జ‌పాన్ ప్ర‌ధానికి తప్పిన పెను ప్ర‌మాదం

Japan PM: జ‌పాన్ ప్ర‌ధానికి తప్పిన పెను ప్ర‌మాదం

జ‌పాన్ లో ప్రధానుల మీద వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. గ‌త ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్ర‌ధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్య‌క్తి కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌ధాని ఫుమియో కిషిదాకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. పశ్చిమ జపానులోని ఒసాకా నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఓ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వ‌క‌యామా సమీపంలోని సైకజకి ఫిషింగ్ హార్బర్ లో ప్ర‌ధాని కిషిదా ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆయ‌న ప్ర‌సంగం ప్రారంభం చేయ‌డానికి కొన్ని సెక‌న్ల ముందే భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. మీటింగ్ నిర్వ‌హిస్తున్న నేత‌ల‌పై స్మోక్ లేదా పైప్ బాంబును విసిరి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

ప్ర‌ధాని మీటింగ్‌కు హాజ‌రైన జ‌నం.. బాంబు పేలుడుతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అక్క‌డ ఉన్న వారంతా ఉరుకులు ప‌రుగులు పెట్టారు. బాంబు దాడిలో కిష‌దాకు ఎటువంటి న‌ష్టం జ‌రగ‌లేదు. దీంతో ఆయ‌న్ను అక్క‌డ నుంచి హుటాహుటిన త‌ర‌లించారు. లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ వ్య‌క్తితో కిషిదా మాట్లాడుతున్న స‌మ‌యంలో బాంబు పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. స్మోక్ బాంబుతో అటాక్ చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకున్న‌ట్లు స్థానిక మీడియా చెబుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్